ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బావిలోకి దూసుకెళ్లిన కారు..

బావిలోకి దూసుకెళ్లిన కారు..

📰 Generate e-Paper Clip

* ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురి మృతి
* సిద్దిపేట జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, క్రైమ్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యి చెందడం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది. దుబ్బాక మండలం బలవంతపూర్‌ గ్రామానికి చెందిన దంపతులు రాజు భాగ్య, కుమారుడు నియాన్ష్‌, కుమార్తె శాన్విక బుధవారం సాయంత్రం సిద్దిపేటకు వెళ్లాడు. అక్కడ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే రాత్రి అవుతున్నా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబససభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ఆధారంగా అప్పనపల్లి శివారులో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించగా కారు ప్రమాదానికి గురైనట్లు గుర్తించి, వెంటనే సహాయక చర్యలు చేపట్టి బావిలో నుంచి కారును బయటకు తీశారు. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్పటికే చనిపోయారు. అయితే మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన కుటుంబం ప్రాణాలు కోల్పోవడంతో అప్పనపల్లి, బలవంతపూర్‌ గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular