స్పాట్ వాయిస్, నల్లబెల్లి: మండల కేంద్రంలోని ఓ నూనె మిల్లులో ప్రమాదవశాత్తు మహిళ కుడిచేయి యంత్రంలో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. రంగాపురం గ్రామానికి చెందిన కందకట్ల కవిత వేరుశనగ నూనె పట్టించేందుకు మిల్లుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె కుడిచేయి యంత్రంలో చిక్కుకుంది. దీంతో భుజం వరకు చేయి ఉడిపోయిo ది దింతో యజమానులు, స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
