ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeసినిమా"గీతాంజలి" మళ్ళీ వస్తోంది

“గీతాంజలి” మళ్ళీ వస్తోంది

📰 Generate e-Paper Clip

  • 28న 4K రీ-రిలీజ్

స్పాట్ వాయిస్ , సినిమా : అక్కినేని నాగార్జున కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘గీతాంజలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథను ఆగస్టు 28న 4K ఫార్మాట్‌లో తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నారు.

నాగార్జున పుట్టినరోజుకు ఒక్కరోజు ముందే సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రక్షాబంధన్ సందర్భంగా ఈ ప్రత్యేకమైన రీ-రిలీజ్ మరింత సందడి చేయనుంది.

శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్ల శివ ప్రసాద్ ఆధునిక సాంకేతికతతో ‘గీతాంజలి’ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. 4K విజువల్స్, మెరుగైన సౌండ్‌తో ఈ ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరీని థియేటర్లలో మరోసారి చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular