ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeతెలంగాణజయశంకర్ భూపాలపల్లియూనియన్ బ్యాంకులో కూలిన సీలింగ్..

యూనియన్ బ్యాంకులో కూలిన సీలింగ్..

📰 Generate e-Paper Clip

 

 భయాందోళనతో పరుగులు తీసిన ఖాతాదారులు, సిబ్బంది

 కొద్దిపాటి గాయాలతో బయటపడ్డ పలువురు

స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ శాఖలో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. బ్యాంకు కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పైకప్పునకు ఉన్న ఫాల్స్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వివరాల్లోకి వెళ్తే.. రోజూ మాదిరిగానే మధ్యాహ్నం వేళ ఖాతాదారులు నగదు లావాదేవీల నిమిత్తం కౌంటర్ల వద్ద వేచి ఉన్నారు. అదే సమయంలో బ్యాంకు పైభాగంలోని ఫాల్స్ సీలింగ్ షీట్లు, సపోర్ట్ ఫ్రేములు పెద్ద శబ్దంతో కౌంటర్లపై, వినియోగదారులు నిల్చున్న ప్రదేశంలో పడిపోయాయి. ఈ ఊహించని ఘటనతో బ్యాంకులోని ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురై కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కొందరు వినియోగదారులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీలింగ్ శకలాలు కంప్యూటర్లు, క్యాష్ కౌంటర్లపై పడటంతో కార్యకలాపాలు తాత్కాలికంగా స్తంభించిపోయాయి. కాగా, బ్యాంకు భవన నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఖాతాదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular