ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeతెలంగాణఎంపీడీవో కార్యాలయానికి తాళం..!

ఎంపీడీవో కార్యాలయానికి తాళం..!

📰 Generate e-Paper Clip

గంటపాటు ఎదురుచూసిన సిబ్బంది

 సమయానికి రాని మహిళా అటెండర్‌

చివరకు తాళం పగలగొట్టి లోనికి ప్రవేశం

స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో బుధవారం ఉదయం ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది. సమయానికి విధులకు హాజరైన సిబ్బందికి కార్యాలయ ప్రధాన ద్వారానికి తాళం వేసి కనిపించడంతో సుమారు గంటపాటు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రోజూ మాదిరిగానే నిర్ణీత సమయానికి సిబ్బంది, ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. అయితే కార్యాలయాన్ని తెరిచి శుభ్రం చేయాల్సిన మహిళా అటెండర్‌ సమయానికి రాకపోవడంతో ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. దీంతో లోపలికి వెళ్లే వీలులేక ఉద్యోగులు వరండాలోనే పడిగాపులు కాశారు. ఎంతసేపు వేచి చూసినా ఆమె రాకపోవడం, అధికారిక పనులకు సమయం మించిపోతుండటంతో చేసేదేమీ లేక సిబ్బంది చివరకు తాళం పగలగొట్టి లోనికి వెళ్లారు. ఈ పరిణామంతో ఉదయం కార్యాలయ దైనందిన కార్యకలాపాలు ప్రారంభం కావడంలో తీవ్ర ఆటంకం ఏర్పడింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి నిర్లక్ష్య వైఖరి సరికాదని, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించేలా పర్యవేక్షణ పెంచాలని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular