యూనియన్ బ్యాంకులో కూలిన సీలింగ్..

   భయాందోళనతో పరుగులు తీసిన ఖాతాదారులు, సిబ్బంది  కొద్దిపాటి గాయాలతో బయటపడ్డ పలువురు స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ శాఖలో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. బ్యాంకు కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పైకప్పునకు ఉన్న ఫాల్స్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వివరాల్లోకి వెళ్తే.. రోజూ మాదిరిగానే మధ్యాహ్నం వేళ ఖాతాదారులు నగదు లావాదేవీల నిమిత్తం కౌంటర్ల వద్ద వేచి ఉన్నారు. అదే సమయంలో బ్యాంకు పైభాగంలోని ఫాల్స్ సీలింగ్ షీట్లు, సపోర్ట్ ఫ్రేములు...