స్పాట్ వాయిస్, నర్సంపేట: టీజీఎస్ ఆర్టీసీ మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళికపై ప్రయాణికురాలు జరిపిన దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో కార్మికులు ధర్నా నిర్వహించారు. గాయపడిన ప్రవళికకు మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కోలుకునే వరకు పూర్తి జీతంతో ఐఓడీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన ప్రయాణికురాలికి కఠిన శిక్ష విధించడంతోపాటు ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. మహిళా ఉద్యోగుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నర్సింహులు, సుజాత, రవీందర్ రెడ్డి, చైతన్య, సూపర్‌వైజర్ గోవర్ధన్‌తోపాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

