ePaper
Friday, August 21, 2026
ePaper
Homeసినిమా"మల్లెపూల పల్లకిలో" రామ్ చరణ్..?

“మల్లెపూల పల్లకిలో” రామ్ చరణ్..?

📰 Generate e-Paper Clip

  • ‘ఇరుముడి’లో రామ్‌చరణ్‌ ఉన్నాడా?

  • క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్‌..!

స్పాట్ వాయిస్ , సినిమా: ‘ఇరుముడి’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలతో రామ్‌చరణ్‌ ఈ సినిమాలో కనిపించనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ‘మల్లెపూల పల్లకి..’ పాటలో అయ్యప్ప మాల ధరించిన రామ్‌చరణ్‌ కనిపిస్తారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. సినిమా టీమ్‌ కూడా దీనిపై వెంటనే స్పందించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

అయితే ఈ రూమర్లకు తాజాగా మూవీ టీమ్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ‘ఇరుముడి’ సినిమాలో రామ్‌చరణ్‌ నటించడం లేదని స్పష్టం చేసింది. చరణ్‌ కనిపిస్తారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. ఇలాంటి అసత్య ప్రచారాలను చేయొద్దని అభిమానులు, ప్రేక్షకులను కోరింది.

దీంతో రామ్‌చరణ్‌ విషయంలో క్లారిటీ వచ్చినప్పటికీ.. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పిన అసలు సర్‌ప్రైజ్‌ ఏంటి? ‘మల్లెపూల పల్లకి..’ పాటలో కనిపించబోయే ఆ ప్రత్యేక అతిథి ఎవరు? అనే ఆసక్తి మాత్రం కొనసాగుతోంది.

ఇక ‘ఇరుముడి’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అక్కడి నుంచే కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుందని దర్శకుడు శివ నిర్వాణ వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించగా.. ఆయన కూతురు పాత్రలో బేబీ నక్షత్ర కనిపించనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular