పెళ్లయిన 18 రోజులకే విషాదం..
అదనపు కట్నం కోసం వేధింపులే కారణమని తల్లి ఫిర్యాదు
స్పాట్ వాయిస్, క్రైమ్ : పెళ్లయిన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పల్లవి (20) ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ ఏడాది ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డితో పల్లవికి వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం భర్త శారీరకంగా, మానసికంగా వేధించాడని, ఈ వేధింపులు భరించలేక పల్లవి తాను చదువుతున్న కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత జీడిమెట్లలోని ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం మేడిపల్లిలోని మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో పల్లవి మృతి చెందింది. పల్లవి తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
RELATED ARTICLES

