కారును ఢీకొన్న ఆటో.. డ్రైవర్‌కు గాయాలు
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న కారు, రఘునాథపల్లి వద్ద ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదంతో స్థానికంగా కొద్దిసేపు కలకలం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

