ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణ23 నుంచి 25 వరకు ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్షలు..

23 నుంచి 25 వరకు ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్షలు..

📰 Generate e-Paper Clip

భారీ వాహనాలకు దారి మళ్లింపు
నిమజ్జన మార్గాల్లో వాహనాల నిలిపివేతపై నిషేధం
స్పాట్ వాయిస్, వరంగల్: వినాయక నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో వరంగల్‌-హనుమకొండ-కాజీపేట ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. నిమజ్జనానికి భారీ సంఖ్యలో విగ్రహాలను తరలించే మార్గాల్లో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపడుతున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ తెలిపారు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి 25న సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.
భారీ వాహనాలకు దారి మళ్లింపు
* ములుగు, భూపాలపల్లి వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలు ఆరేపల్లి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) మీదుగా వెళ్లాలి. భూపాలపల్లి-పరకాల నుంచి ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు ఆరేపల్లి నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా కరుణాపురం, వెంకటాపూర్‌, ఐనవోలు, పున్నేలు క్రాస్‌రోడ్‌ మీదుగా ఖమ్మం రోడ్డుకు చేరుకోవాలి. నర్సంపేట వైపు వెళ్లే భారీ వాహనాలు కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పరలు, గొర్రెకుంట మీదుగా వెళ్లాలి.

* కరీంనగర్‌ నుంచి ఖమ్మం వెళ్లే భారీ వాహనాలు చింతగట్టు వద్ద ఓఆర్‌ఆర్‌పైకి చేరి యూటర్న్‌ తీసుకుని కరుణాపురం, వెంకటాపూర్‌, ఐనవోలు, పున్నేలు క్రాస్‌రోడ్‌ మీదుగా వెళ్లాలి. ఖమ్మం నుంచి కరీంనగర్‌, హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు పున్నేలు క్రాస్‌రోడ్‌, ఐనవోలు ఆర్చ్‌, వెంకటాపూర్‌, కరుణాపురం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

* హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్లే భారీ వాహనాలు కరుణాపురం, వెంకటాపూర్‌, ఐనవోలు, పున్నేలు క్రాస్‌రోడ్‌ మీదుగా వెళ్లాలి. హైదరాబాద్‌ నుంచి నర్సంపేట వైపు వెళ్లే వాహనాలు కరుణాపురం నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా ఆరేపల్లి, ఆత్మకూరు, కటాక్షపూర్‌, మల్లంపల్లి మీదుగా వెళ్లాలి. నర్సంపేట నుంచి వరంగల్‌, హైదరాబాద్‌ వైపు వెళ్లే భారీ వాహనాలు మల్లంపల్లి, కటాక్షపూర్‌, ఆత్మకూరు, ఆరేపల్లి మీదుగా ఓఆర్‌ఆర్‌కు చేరుకోవాలి. నగరంలోకి వచ్చే భారీ వాహనాలను నగర శివార్లలోనే నిలిపివేయాలని, నిమజ్జనం సమయంలో ఎలాంటి భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని సీపీ స్పష్టం చేశారు.
బస్సులకు మార్గాల మార్పు
* ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు పెద్దమ్మగడ్డ, కేయూసీ, సీవీపీ అంబేద్కర్‌ సెంటర్‌, ఏషియన్‌ శ్రీదేవి మాల్‌ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. హనుమకొండ బస్టాండ్‌ నుంచి ములుగు, కరీంనగర్‌ వైపు వెళ్లే బస్సులు ఏషియన్‌ శ్రీదేవి మాల్‌, అంబేద్కర్‌ సెంటర్‌, సీపీఓ, కేయూసీ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.

* నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు బాలసముద్రం, అదాలత్‌, హంటర్‌రోడ్‌ మీదుగా ప్రయాణించాలి. వరంగల్‌ బస్టాండ్‌ నుంచి హనుమకొండ వైపు వచ్చే బస్సులు చింతల్‌ బ్రిడ్జి, రంగశాయిపేట, నాయుడు పెట్రోల్‌ పంప్‌ సెంటర్‌, ఉర్సుగుట్ట, అదాలత్‌, బాలసముద్రం మీదుగా వెళ్లాలి.

చిన్న వాహనాలకూ దారి మళ్లింపు

* కాజీపేట నుంచి వరంగల్‌ వైపు వెళ్లే కార్లు, ఇతర చిన్న వాహనాలు ఫాతిమా జంక్షన్‌, వడ్డేపల్లి చర్చి, కేయూసీ జంక్షన్‌, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు, ఎంజీఎం, జెమిని, పోతన జంక్షన్‌, అండర్‌ బ్రిడ్జి, హెడ్‌ పోస్టాఫీస్‌, వరంగల్‌ బస్టాండ్‌, వెంకట్రామ సర్కిల్‌ మీదుగా వెళ్లాలి. ఇదే మార్గంలో వరంగల్‌ నుంచి కాజీపేట వైపు వెళ్లే వాహనాలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని పోలీసులు సూచించారు.

* నిమజ్జన వాహనాలకు ప్రత్యేక మార్గాలు
సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం పూర్తిచేసిన వాహనాలు శాయంపేట వైపు వెళ్లే రహదారి మీదుగా వెళ్లాలి. శాయంపేట వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహ వాహనాలు హంటర్‌రోడ్‌, అదాలత్‌, హనుమకొండ చౌరస్తా మీదుగా ప్రయాణించాలి. ఎక్సైజ్‌ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలను బంధం చెరువులోనే నిమజ్జనం చేయాలని సూచించారు. చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం పూర్తిచేసిన వాహనాలు ఎనుమాముల రోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు వైపు వెళ్లాలి. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాలు, నిమజ్జన కేంద్రాల వద్ద వాహనాలను నిలిపివేయరాదని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ ఆంక్షలకు ప్రజలు, గణేష్‌ ఉత్సవ కమిటీలు సహకరించాలని సీపీ ఎన్‌. శ్వేత విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular