ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణపోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

📰 Generate e-Paper Clip

 

టేకుమట్ల, స్పాట్ వాయిస్: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కుటుంబాలను విడిచిపెట్టి ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వర్తిస్తూ, అవసరమైన సందర్భాల్లో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ప్రతి ఒక్కరూ హృదయపూర్వక నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.అమరవీరుల ధైర్యసాహసాలు, అంకితభావం, సేవానిరతి సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను జాతి ఎన్నటికీ మరువదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular