ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeజాతియంఆగస్టు 29 డెడ్ లైన్..

ఆగస్టు 29 డెడ్ లైన్..

📰 Generate e-Paper Clip

కేంద్రానికి రైతుల ఆల్టిమేటం..
డిమాండ్లు నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఆందోళనలు
స్పాట్ వాయిస్, డెస్క్ : భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం తిరిగి చర్చలు ప్రారంభించాలని, ఢిల్లీ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆగస్టు 29లోగా సమస్యలు పరిష్కరించకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టి, మహా పంచాయత్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. . మంగళవారం రైతులు ఖనౌరీ దాతా సింగ్‌వాలా సరిహద్దు వద్ద టెంట్లు వేసుకుని నిరసనలు కొనసాగించారు. కాలినడకన ఢిల్లీకి వెళ్లేందుకు తమకు అనుమతినివ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులతో దేశీయ వ్యవసాయ రంగానికి నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ లైన్లు, భూసేకరణ, పరిహారం, కనీస మద్దతు ధర, ఎరువుల కొరత వంటి సమస్యలపైనా వివిధ రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రైతుల ఆదాయం, భూమిని ప్రభావితం చేసే నిర్ణయాలపై తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని రైతు సంఘాలు కోరుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular