ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీలో మరో కొత్తపార్టీకి శ్రీకారం..?!

ఏపీలో మరో కొత్తపార్టీకి శ్రీకారం..?!

📰 Generate e-Paper Clip

కొత్త పార్టీ పెడుతున్నా..
ఈ నెలలోనే ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ
స్పా్ట్ వాయిస్, డెస్క్ : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ పునఃప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. వైఎస్సార్‌సీపీలో తిరిగి చేరతారన్న ప్రచారానికి తెరదించుతూ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడతానని, ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే తన రాజకీయ ప్రణాళిక, పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తానన్నారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ విధివిధానాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, స్వతంత్ర భావజాలంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. గతేడాది విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన ఆయన.. అనంతరం కొత్త పార్టీతో రాజకీయాల్లోకి తిరిగి వస్తానని వెల్లడించారు. కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరనున్నారంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనుకాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమైంది. పార్టీ పేరుపై సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, అధికారికంగా పేరు, విధివిధానాలను ఈ నెలలో ప్రకటించే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular