ePaper
Monday, September 14, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఖిలాషాపురంలో మోటార్ కేబుల్స్ చోరీ

ఖిలాషాపురంలో మోటార్ కేబుల్స్ చోరీ

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి, స్పాట్ వాయిస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రైతులకు చెందిన బోరు మోటార్ కేబుల్స్‌ను కోసుకెళ్లారు. గండి కింద ప్రాంతానికి చెందిన వంగాల కనకరాజు, వంగాల కర్ణాకర్, బక్క చేరాలు, కుమార్, బక్క మల్లయ్యల కేబుల్స్ చోరీకి గురయ్యాయి. దీంతో సుమారు రూ.15 వేల నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. కేబుల్స్ చోరీతో పంటలకు నీరందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దొంగలను గుర్తించి పట్టుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular