ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణసీఎం అవినీతి సామ్రాట్

సీఎం అవినీతి సామ్రాట్

📰 Generate e-Paper Clip

సీఎం అవినీతి సామ్రాట్
బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు
కమీషన్లు ఎందుకంటూ అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేస్తున్నడు
గుంపు మేస్త్రీ – గుంటనక్క మధ్య కుమ్మక్కు లేకుంటే నేను ఆధారాలు ఇస్తా..
సిద్దిపేటలో వంద ఎకరాల భూ బదలాయింపుపై చర్యలు తీసుకోండి
సీఎం పాపాల చిట్టా బయటపెడుతా..
20 న కొడంగల్ వస్తున్నాం
టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

స్పాట్ వాయిస్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అవినీతి సామ్రాట్.. బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులు, మంత్రి మండలి, అవినీతిలో రాటుదేలిన మంత్రులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి నిన్న అసెంబ్లీలో తనకు కమీషన్లు ఎందుకంటూ కమల్ హాసన్ లెవల్ లో ఏకపాత్రాభినయం చేస్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన చరిత్రను ప్రజలు మర్చిపోరని శనివారం ఆమె వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. గుంపు మేస్త్రీ – గుంటనక్క కుమ్మక్కయారని కవిత ఆరోపించారు. సిద్దిపేటలో నిషేధిత జాబితాలో ఉన్న వంద ఎకరాల భూమిని హరీశ్ రావు తన తండ్రి, కుటుంబ సభ్యుల పేరు మీదకు బదలాయించాడని దానిపై చర్యలు తీసుకునే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు. అటు ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీని అధికార, ప్రతిపక్షాల గొడవలకు వేదిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్
రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకోని రియల్టర్లను బెదిరిస్తే…ఇప్పుడు అధికారంలో ఉండి కుటుంబ సభ్యులు, మంత్రి మండలి మిత్రులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బ్లాక్ మెయిలర్ల సంఘం పెడితే దానికి రేవంత్ రెడ్డే అధ్యక్షుడవుతారన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఆంధ్రా వ్యక్తులతో కలిసి క్యాష్ తో డీల్ చేసి అడ్డంగా దొరికిందెవరు..? అని కవిత ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు నుంచే బ్లాక్ మెయిలింగ్ తో అడ్డంగా అక్రమాలకు పాల్పడిన చరిత్ర రేవంత్ ది అన్నారు. అలాంటి వ్యక్తికి అధికారం రావడంతో అవినీతిలో రాటుదేలిన మంత్రులతో కలిసి ఇప్పుడు రాచమార్గంలో అవినీతి సామ్రాజ్యం నిర్మిస్తున్నారన్నారు. అసెంబ్లీలో తనకు కమీషన్ల అవసరమేంటనీ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి దోచుకునే మిత్రమండలిని, భయంకరమైన కుటుంబాన్ని, అవినీతిలో రాటుదేలిన మంత్రులను భగవంతుండు ఇచ్చాడని చెప్పారు. 22ఏను పొంగులేటికి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఇసుకను సీతక్కకు రాసిచ్చి వారి ద్వారా కమీషన్లు పొందుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కవిత విమర్శించారు. మూసీ నుంచి ఇసుక వరకు ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడుతున్నారని కవిత మండిపడ్డారు. స్వాతిముత్యంలో కమల్ హాసన్ మాదిరిగా అసెంబ్లీలో ఏకపాత్రాభియనం చేస్తూ సుద్దపూసనని నటిస్తే ప్రజలు నమ్మరని అన్నారు.

గుంటనక్కతో గుంపు మేస్త్రీ కుమ్మక్కు
సీఎం రేవంత్ రెడ్డి తన అవినీతి కోసం అటు బీఆర్ఎస్ తో, ఇటు బీజేపీ తో దోస్తానా చేస్తున్నాడని కవిత ఆరోపించారు. ముఖ్యంగా గుంటనక్కతో గుంపు మేస్త్రీ కుమ్మక్కయ్యాడని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సిద్ధిపేటలో నిషేధిత జాబితాలో ఉన్న వంద ఎకరాల భూమిని హరీష్ రావు తన తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడని కవిత చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను పంపిస్తానన్నారు. నిజంగా గుంటనక్కతో గుంపుమేస్త్రీ కుమ్మక్కు కాకపోతే చర్యలు తీసుకోవాలని కవిత సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దుమ్ముంటే ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా?
అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నాయకులు…కాంగ్రెస్ కన్నా ఎక్కువగా దోచుకున్నారని కవిత ఆరోపించారు. ఆ పార్టీ నాయకులకు ప్రజల కోసం పోరాటం చేయాలన్న సోయి లేకుండా పోయిందని విమర్శించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి తన గొప్పులు చెప్పుకుంటూ సభను తన అడ్వర్ టైజ్ మెంట్ కోసం వాడుకుంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కౌంటర్ చేసే వాళ్లే సభలో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలను సస్పెండ్ చేస్తే…కౌన్సిల్ లో ఎందుకు మాట్లాలేదని ప్రశ్నించారు. కౌన్సిల్ లో వాకౌట్ చేయాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీశారు. ప్రజలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేశారో అత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. అధికారంలో ఉంటేనేసభకు వస్తారా అంటూ బీఆర్ఎస్ ను ప్రశ్నించారు.

అసెంబ్లీలో పరిణామాలు ఆవేదన కలిగించాయి
అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలు ఆవేదన కలిగించాయని కవిత అన్నారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన వేదికను అధికార, ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలను వదిలి ఒకరినొకరు తిట్టుకోవటానికే అసెంబ్లీని వేదికగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పది నిమిషాలు అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తే లక్షలాది మంది ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. కానీ ఆ సోయి మర్చి అధికార, ప్రతిపక్షాలు ప్రజాధనం దుర్వినియోగం చేశాయన్నారు. అటు బీజేపీ సభ్యులుసైతం ప్రజా సమస్యలు వదిలి కాంగ్రెస్ కు కొందరు, బీఆర్ఎస్ కు కొందరు బీఆర్ఎస్ కు మద్దతిచ్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రేవంత్ పాపాల చిట్టా బయటపెడతాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి పాపాల చిట్టాను కొడంగల్ వేదికగా బయటపెడతామని కవిత అన్నారు. ఈ నెల 20 న కొడంగల్ లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నామన్నారు. అదే రోజు కొడంగల్ వేదికగానే ముఖ్యమంత్రి అవినీతిని ప్రజలు ముందు పెడతామని కవిత చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular