స్పాట్ వాయిస్ ,వరంగల్: తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన అనంతరం కొందరు అల్లర్లు చేయాలా? అంటూ ఫోన్ చేశారని కొండా సురేఖ తెలిపారు. అయితే అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి సూచించానన్నారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్‌రెడ్డి వంటి మాస్ లీడర్ కాంగ్రెస్‌కు అవసరమని చెప్పిన తొలి వ్యక్తిని తానేనని అన్నారు. అదృష్టవశాత్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. పదవి కోల్పోయినా రాజకీయంగా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

