ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్పాముకాటుతో రైతు మృతి...

పాముకాటుతో రైతు మృతి…

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్ మల్హర్: మండల కేంద్రమైన తాడిచర్లలో పాముకాటుతో రైతు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కందుల మల్లయ్య (52) శనివారం తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా పాము కాటు వేసింది. వెంటనే గమనించిన స్థానిక రైతులు అతన్ని సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు జిల్లా ప్రధాన ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లయ్య మృతి చెందాడు.మృతుడికి భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular