ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeతెలంగాణకాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవుల సందడి

కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవుల సందడి

📰 Generate e-Paper Clip

80 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవుల భర్తీపై కసరత్తు

హైదరాబాద్‌, స్పాట్‌ వాయిస్‌: కాంగ్రెస్‌ నాయకులు ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవుల భర్తీపై కదలిక మొదలైంది. సుమారు 80 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులను భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ కావడంతో ఆశావహుల్లో ఆసక్తి పెరిగింది. పదవుల భర్తీతోపాటు పీసీసీ కార్యవర్గం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే సిద్ధమైన జాబితాలో 50 మంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పాతవారిలో కొందరికి మళ్లీ అవకాశం కల్పించి, మిగిలిన పదవులను కొత్తవారితో భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular