ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeజాతియంజల బోర్డు కుంభకోణం కేసులో మాజీ మంత్రి  అరెస్ట్..!

జల బోర్డు కుంభకోణం కేసులో మాజీ మంత్రి  అరెస్ట్..!

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన జల బోర్డు కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ జల బోర్డు సీఈవోగా ఉన్న సమయంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల టెండర్ల అనుమతి, కాంట్రాక్టుల వ్యవహారంలో రూ.1.52 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో జల బోర్డు మాజీ సీఈవో, ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, మాజీ కాంట్రాక్ట్ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాస్తవ, ఏఎన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రొప్రైటర్ నాగేంద్ర యాదవ్, యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని రాజ్ కుమార్ కుర్రా, శ్రీజన్హర్ ప్రొప్రైటర్ పంకజ్ వర్మను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఆరుగురిపై 2024 మే 11న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తాజా అరెస్టుతో ఆప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular