స్పాట్ వాయిస్, నర్సంపేట: బీఆర్‌ఎస్ పిలుపుతో నర్సంపేటలో బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని దుకాణాలను మూసివేశారు. ఆర్టీసీ బస్సులు సైతం డిపోకే పరిమితమయ్యాయి. బీఆర్‌ఎస్ నాయకులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. బంద్‌తో నర్సంపేటలో రహదారులు, వ్యాపార సముదాయాలు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు అత్యవసర పనులకే బయటకు వచ్చారు.
