స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి మండలంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవలే మూడు ఇళ్లల్లో చోరీ జరగగా.. తాజాగా శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని రిపోర్టర్ ఆకుల మహేష్ గ్లామర్ బైక్ ఎత్తుకెళ్లారు. మహేష్ రోజులానే ఇంటి ఎదుట బైక్ పార్క్ చేసాడు. తెల్లవారి చూసేసరికి చోరీకి గురి అయింది.

