ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణబండి భగీరథ్ పై లుక్ ఔట్ నోటీసులు

బండి భగీరథ్ పై లుక్ ఔట్ నోటీసులు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, బ్యూరో: బండి భగీరథ్​పై నమోదైన పోక్సో కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న బండి భగీరథ్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతను దేశం దాటి పోకుండా లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతని ఫోన్ కాల్ డేటా ఆధారంగా బంధువులు, స్నేహితుల ఇళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. భగీరథ్‌ కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని అతని తండ్రి నివాసానికి వెళ్లిన ఓ బృందం గంటపాటు తనిఖీలు చేసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని సన్నిహితులు బంధువుల ఇళ్లల్లో మరో మూడు బృందాలు నిఘా పెట్టాయి. వీటితో పాటు కరీంనగర్‌లో మరో బృందం గాలిస్తోంది. ఉదయం నుంచి బండి భగీరథ్‌ లొంగిపోతారని ప్రచారం సాగింది. సైబరాబాద్ కమిషనరేట్‌ కార్యాలయం వద్ద, పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు బందోబస్తు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడవద్దనే కోణంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular