ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణగవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై పెరుమాండ్ల రామకృష్ణ ఆశలు..

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై పెరుమాండ్ల రామకృష్ణ ఆశలు..

📰 Generate e-Paper Clip

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని డిల్లీ లో కేసీ వేణుగోపాల్‌కు వినతి 

సీఎం రేవంత్ రెడ్డి గారు ‌, వేం నరేందర్‌రెడ్డి పై పూర్తి విశ్వాసం: డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల 

స్పాట్ వాయిస్, వరంగల్: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం వస్తే పేదలకు ఎక్కువ సేవ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి సచిన్‌ సావంత్‌ను ఆయన కలిసి తన అభ్యర్థనను తెలియజేశారు. కాంగ్రెస్‌ పార్టీలో తన ప్రస్థానం, విద్యార్తి దశ NSUI నుండి పార్టీ కోసం చేసిన సేవలు, ఎస్సీ ఎస్టీ బీసీ వివిధ ప్రజాసంఘాలు విలేకరుల సమావేశాల ద్వారా రామకృష్ణ కు ఎంఎల్సీ విజ్ఞప్తులను, రాజకీయ అనుభవంతో కూడిన బయోడేటాను కేసీ వేణుగోపాల్‌కు అందజేశారు.

అధిష్టానంపై సంపూర్ణ విశ్వాసం

కాంగ్రెస్‌ అధిష్టానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులను నాయకత్వం తప్పకుండా గుర్తిస్తుందన్న విశ్వాసం ఉందని కాంగ్రెస్ నేత డాక్టర్ పెరుమాoడ్ల రామకృష్ణ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిపై కూడా తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. పార్టీ కోసం చేసిన సేవలను, తన రాజకీయ ప్రస్థానాన్ని పరిగణనలోకి తీసుకుని గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ సేవలకు గుర్తింపు దక్కుతుందనే ఆశ

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి, ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్న నాయకులకు తగిన గుర్తింపు లభించాలన్నదే తన ఆకాంక్ష అని రామకృష్ణ పేర్కొన్నారు. పదవులు బాధ్యతతో కూడినవని, అవకాశం లభిస్తే ప్రజాసేవకు మరింత విస్తృతంగా కృషి చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు సముచిత ప్రాధాన్యం కల్పించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలను కలిసి తన అభ్యర్థనను వివరించిన నేపథ్యంలో, అధిష్టానం నిర్ణయంపై రామకృష్ణ ఆశలు పెట్టుకున్నారు. తన రాజకీయ అనుభవం, పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ అవకాశం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular