ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeతెలంగాణడీజే హోరుతో రోగుల అవస్థలు..

డీజే హోరుతో రోగుల అవస్థలు..

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాల సందర్భంగా భారీ శబ్దాలతో డీజే ఏర్పాటు చేయడంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేడుకలకు తాము వ్యతిరేకం కాదని, అయితే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులు, చిన్నారులు, నవజాత శిశువులతో పాటు ఇతర రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు. సూపరింటెండెంట్ ఆధ్వర్యంలోనే వేడుకలు జరుగుతున్నాయని, రోగులకు ఇబ్బందులు ఎదురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. పండుగ సంబరాల నిర్వహణలో రోగుల ఆరోగ్యం, ప్రశాంతతకు ప్రాధాన్యమివ్వాలని, ఆసుపత్రి అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular