ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeఎడిటోరియల్25న ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాల పంపిణీ

25న ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాల పంపిణీ

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్ హనుమకొండ: ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) హనుమకొండ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన ఆర్యవైశ్య విద్యార్థులకు 61 బంగారు పతకాలను పంపిణీ చేయనున్నట్లు అధ్యక్షుడు దొంతుల ఈశ్వరయ్య తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 10.30 గంటలకు సుబేదారిలోని అవోపా భవనంలో పతకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ, పీహెచ్‌డీ వరకు ఉత్తీర్ణులైన ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు, 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 19లోపు మార్కుల జాబితా, ర్యాంక్ కార్డు, ఫొటో, ఆధార్ జతచేసి దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు 7093035699, 9989913365 నంబర్లను సంప్రదించాలన్నారు. సమావేశంలో కార్యదర్శి కమటాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular