25న ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాల పంపిణీ
స్పాట్ వాయిస్ హనుమకొండ: ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) హనుమకొండ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన ఆర్యవైశ్య విద్యార్థులకు 61 బంగారు పతకాలను పంపిణీ చేయనున్నట్లు అధ్యక్షుడు దొంతుల ఈశ్వరయ్య తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 10.30 గంటలకు సుబేదారిలోని అవోపా భవనంలో పతకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ, పీహెచ్డీ వరకు ఉత్తీర్ణులైన ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు,...