స్పాట్ వాయిస్,గణపురం: మండల పరిధిలోని బస్వరాజుపల్లి 8వ ఇంక్లైన్ సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతూ పట్టుబడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి, వారి వద్ద నుంచి రూ. 2,530 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. మండల పరిధిలో పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
RELATED ARTICLES

