స్పాట్ వాయిస్, వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పార్ట్‌టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం కేయూ గెస్ట్‌హౌస్‌లో ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్ష పదవికి డాక్టర్ కె.రాజేందర్, డాక్టర్ కె.సుబాష్ పోటీ పడగా.. మొత్తం 145 మంది ఓటర్లకు 84 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజేందర్‌కు 64 ఓట్లు, సుభాష్‌కు 20 ఓట్లు పోలయ్యాయి. దీంతో డాక్టర్ కె.రాజేందర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫలితాలను ప్రెసైడింగ్ అధికారి డాక్టర్ ఆదిరెడ్డి ప్రకటించారు. నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ నాగేశ్వర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ వాణీదేవి, కోశాధికారిగా డాక్టర్ టి.మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ పి.మహేందర్, ఉమెన్ కన్వీనర్‌గా డాక్టర్ భాగ్యమ్మ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

