ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణఅన్నిదానాల్లోకెల్లా అన్నదానం గొప్పది..

అన్నిదానాల్లోకెల్లా అన్నదానం గొప్పది..

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: గణేశ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. రఘునాథపల్లి మండల కేంద్రంలోని గిర్నిగడ్డ సమీపంలో బీఆర్‌ఎస్ జిల్లా యువనేత దుబ్బాక హరీష్ గౌడ్- నీరజ దంపతులు దుబ్బాక కుటుంబ సభ్యులు గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి ఇంటి సమీపంలో భక్తులు, గ్రామస్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుబ్బాక హరీష్ గౌడ్ దంపతులు మాట్లాడుతూ.. ఏటా గణేశుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు చింతకింది కృష్ణమూర్తి, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు కోళ్ల రవి గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు బాల్నే పరశురాములగౌడ్, దుబ్బాక నర్సింహులు, మరకల మహేందర్, నోముల మహేందర్, సురుగు రమేష్, సురుగు హరీష్, మహేందర్, శత్రసి రాము, కంటడి రోహిత్, చెరుకు అజయ్, పొలస నాగరాజు, సురుగు రాజేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular