
*రాజాజీ నగర్ లో ఘనంగా గణపతి నవరాత్రోత్సవాలు*
భక్తిశ్రద్ధలతో మహిళల కుంకుమపూజ
స్పాట్ వాయిస్, హన్మకొండ : హన్మకొండ 52వ డివిజన్ రాజాజీనగర్ లో శ్రీ వరసిద్ధి వినాయక గజానన మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మండలి ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్లుగా వైవిధ్యంగా వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రులూ ఉదయం, సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలకు కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండగా అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తూ, కాలనీ వాసులను, మహిళలు, చిన్నారులను ఉత్సాహపరుస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజా నిర్వహించగా, కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అనంతరం వినాయకుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మండలి సభ్యులు మాట్లాడుతూ ప్రజల్లో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు మహిళల్లో ఐక్యతను పెంపొందించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రోత్సవాలు ముగిసే వరకూ అందరూ సహకరించాలని శ్రీ వరసిద్ధి వినాయక గజానన మండలి సభ్యులు కోరారు.


