
ఘనంగా గణపతి నవరాత్రోత్సవాలు..
యెలుగం వెంకటమల్లు- సునంద దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం
స్పాట్ వాయిస్, వరంగల్ సిటీ : వరంగల్ కొత్తవాడ 23వ డివిజన్ లో పార్వతీపుత్ర యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహిస్తూ కాలనీ వాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం యెలుగం వెంకటమల్లు- సునంద దంపతుల ఆధ్వర్యంలో భక్తలకు మహా అన్న ప్రసాద వితరణ (అన్నదాన) చేశారు. కాగా, అన్నదాన కార్యక్రమాన్ని 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించించారు.


