ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్కాంగ్రెస్‌ వేలేరు మండల అధ్యక్షుడిపై దాడి

కాంగ్రెస్‌ వేలేరు మండల అధ్యక్షుడిపై దాడి

📰 Generate e-Paper Clip

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డీసీసీ అధ్యక్షుడు ఇనగాల
స్పాట్‌ వాయిస్‌, హన్మకొండ: కాంగ్రెస్‌ వేలేరు మండల అధ్యక్షుడిపై భౌతిక దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి ఖండించారు. దాడికి పాల్పడిన నిందితులతో పాటు సూత్రధారులను గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని వేలేరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌ నాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. సాయిపేట–కేశవనగర్‌ సమీపంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న లక్ష్మణ్‌ నాయక్‌ను అడ్డుకున్న దుండగులు ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇనగాల వెంకట్రామిరెడ్డి ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న లక్ష్మణ్‌ నాయక్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇనగాల డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular