కాంగ్రెస్‌ వేలేరు మండల అధ్యక్షుడిపై దాడి

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డీసీసీ అధ్యక్షుడు ఇనగాల స్పాట్‌ వాయిస్‌, హన్మకొండ: కాంగ్రెస్‌ వేలేరు మండల అధ్యక్షుడిపై భౌతిక దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి ఖండించారు. దాడికి పాల్పడిన నిందితులతో పాటు సూత్రధారులను గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని వేలేరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌ నాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. సాయిపేట–కేశవనగర్‌ సమీపంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న లక్ష్మణ్‌ నాయక్‌ను...