తెరిచి చూసిన ఎలక్ట్రీషియన్‌కు షాక్!
స్పాట్ వాయిస్: ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఎలక్ట్రీషియన్‌ను పిలిచారు. అయితే విద్యుత్ సమస్యను పరిశీలించేందుకు గోడకు అమర్చిన డిస్ట్రిబ్యూషన్ బోర్డును తెరిచి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఎలక్ట్రీషియన్‌తో పాటు ఇంట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విద్యుత్ తీగల మధ్య భారీ తేనెతుట్టు ఏర్పడింది.
డిస్ట్రిబ్యూషన్ బోర్డులోని తీగల మధ్య మైనపుతో తయారైన హనీకాంబ్, బ్రూడ్ సెల్స్‌తో పాటు తేనెతో నిండిన గూడు కనిపించింది. సాధారణంగా తేనెటీగలు చెట్లు, గోడల ఖాళీలు, పైకప్పులు వంటి ప్రదేశాల్లో తేనెతుట్టులను ఏర్పాటు చేస్తుంటాయి. కానీ విద్యుత్ బోర్డు లోపలే ఇంత పెద్ద తేనెతుట్టు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఎలక్ట్రీషియన్ జాగ్రత్తగా తేనెతుట్టును తొలగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ తీగల మధ్య తేనెతుట్టు ఏర్పడటంతో.. అక్కడి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉండొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇక ఈ తేనెను చూసిన కొందరు నెటిజన్లు ఇది స్టింగ్‌లెస్ బీ హనీ అయి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ తేనెతో పోలిస్తే ఈ రకమైన తేనెకు ప్రత్యేక డిమాండ్ ఉంటుందని, అరుదైనదిగా భావిస్తారని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో దీని ధర కిలోకు సుమారు రూ.3,000 వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
https://x.com/i/status/2089664277024276845

