విద్యుత్ బోర్డులో తేనెతుట్టే..
తెరిచి చూసిన ఎలక్ట్రీషియన్‌కు షాక్! స్పాట్ వాయిస్: ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఎలక్ట్రీషియన్‌ను పిలిచారు. అయితే విద్యుత్ సమస్యను పరిశీలించేందుకు గోడకు అమర్చిన డిస్ట్రిబ్యూషన్ బోర్డును తెరిచి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఎలక్ట్రీషియన్‌తో పాటు ఇంట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విద్యుత్ తీగల మధ్య భారీ తేనెతుట్టు ఏర్పడింది. డిస్ట్రిబ్యూషన్ బోర్డులోని తీగల మధ్య మైనపుతో తయారైన హనీకాంబ్, బ్రూడ్ సెల్స్‌తో పాటు తేనెతో నిండిన గూడు కనిపించింది. సాధారణంగా తేనెటీగలు చెట్లు, గోడల ఖాళీలు, పైకప్పులు వంటి...