ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్విద్యుత్ షాక్‌తో తండ్రి, కుమారుడు మృతి

విద్యుత్ షాక్‌తో తండ్రి, కుమారుడు మృతి

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట శివారులోని రోడ్ డ్యాం వద్ద విద్యుత్ షాక్‌తో తండ్రి, కుమారుడు మృతి చెందారు. కాటారం మండలం గంగారం గ్రామం మార్వాడీపల్లికి చెందిన బాపు, ఆయన కుమారుడు గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద మోటార్‌ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి కొయ్యూరు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular