రఘునాథపల్లి, స్పాట్ వాయిస్: హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారులపై ఉన్న రఘునాథపల్లి మండల కేంద్రంలో గురువారం దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానికుడు పన్నాల వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి సుమారు రూ.20 వేల నగదు, బంగారం అపహరించినట్లు తెలిసింది. వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
