ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణగురిజాల శ్రీరామ్ రెడ్డికి గౌరవ డాక్టరేట్..

గురిజాల శ్రీరామ్ రెడ్డికి గౌరవ డాక్టరేట్..

📰 Generate e-Paper Clip

 

స్పాట్ వాయిస్ దామెర : సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న గురిజాల శ్రీరామ్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ లభించింది. చెన్నైలోని కృష్ణ గాన సభ ఆడిటోరియంలో అక్టోబర్ 10న నిర్వహించిన ‘సోషల్ లీడర్స్ అండ్ విజనరీస్ కాన్‌క్లేవ్–2026’లో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ‘డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ (హానరిస్ కాసా)’ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్‌గా సేవలు ప్రారంభించిన శ్రీరామ్ రెడ్డి, అనంతరం శ్రీరామ్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు విద్యా సహాయం, పేదలకు ఆర్థిక సహకారం, ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు, అన్నదానం, ఆహార, వస్త్రాల పంపిణీతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు సహాయం అందిస్తున్నారు. యూనివర్సిటీ వ్యవస్థాపకులు, డైరెక్టర్, తమిళనాడు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె. వెంకటేశన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబాసిడర్ డాక్టర్ పర్వీందర్ సింగ్, డాక్టర్ స్వామి పద్మేంద్ర, అభిషేక్ పుస్కర్, ప్రొఫెసర్ పి. అమృతవల్లి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవలందిస్తున్న శ్రీరామ్ రెడ్డికి ఈ గౌరవం లభించడం ఆయన సేవా ప్రస్థానంలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular