- ములుగు లోకొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ
స్పాట్ వాయిస్, ములుగు: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సదానందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ర్యాలీ
ములుగు బస్టాండ్ జంక్షన్ నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీ ఏరియా హాస్పిటల్ జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి బస్టాండ్ జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల ఫ్లెక్సీ వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ప్రజల రక్షణలో పోలీసుల సేవలు అమూల్యం
దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని అడిషనల్ ఎస్పీ సదానందం పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజలకు తెలియజేయడంతో పాటు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సాహసం, అంకితభావం, త్యాగాలను స్మరించుకోవడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా కొనియాడారు.

పాల్గొన్న పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల
ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఆర్‌ఐలు స్వామి, శ్రీకాంత్, తిరుపతి, ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్, ఎస్సైలు చంద్రశేఖర్, రచిత్ర, సాయికృష్ణతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


