- స్పాట్ వాయిస్ మల్హర్:భూపాలపల్లిలో రెడ్డి గాండ్ల సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధి, కుల బాంధవుల ఐక్యత, సంక్షేమం, సామాజిక అభ్యున్నతిని ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకుని ఈ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.సంఘం నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా అయిత కరుణాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కామిడి సుధాకర్ రెడ్డి, కోశాధికారిగా చల్ల తిరుపతి రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా శ్రీ గద్దె పోచిరెడ్డి ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా వెన్నపురెడ్డి మహేష్ రెడ్డి, ఎనగంటి శంకర్ రెడ్డి, గౌరవ సలహాదారులుగా బండం పద్మారెడ్డి, రత్నం శివారెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా బండం లక్ష్మారెడ్డి, ప్రచార కార్యదర్శిగా పోటు సత్యనారాయణ రెడ్డి ఎన్నికయ్యారు.అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని, కుల బాంధవులందరినీ ఐక్యంగా ముందుకు నడిపిస్తూ విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఐక్యతే బలం, సంఘ అభివృద్ధే లక్ష్యం, సమాజ అభ్యున్నతే ధ్యేయం అనే ఆశయంతో నూతన కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు.
