ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణఎస్టీలు లేని గ్రామానికి ఎస్టీ కోటా ఎందుకు?

ఎస్టీలు లేని గ్రామానికి ఎస్టీ కోటా ఎందుకు?

📰 Generate e-Paper Clip

దమ్మన్నపేటలో అంగన్‌వాడీ పోస్టుపై అభ్యంతరం..

రిజర్వేషన్ మార్చాలని కలెక్టర్‌కు వినతి

స్పాట్ వాయిస్, దామెర: దామెర మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో మంజూరైన అంగన్‌వాడీ  టీచర్ పోస్ట్  ను ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేయడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎస్టీ జనాభా లేదని, పోస్టు రిజర్వేషన్‌ను మార్చాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ దుబాసి నవీన్‌ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు హన్మకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్‌ దుబాసి నవీన్‌ మాట్లాడుతూ ఇటీవల వెలువడిన అంగన్‌వాడీ పోస్టుల నియామక నోటిఫికేషన్‌లో దమ్మన్నపేట గ్రామానికి ఒక పోస్టును ఎస్టీ కేటగిరీకి కేటాయించారని తెలిపారు. అయితే గ్రామంలో బీసీ, ఓసీ సామాజిక వర్గాల జనాభా మాత్రమే ఉందని, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు లేరని పేర్కొన్నారు. దీంతో ఎస్టీ కేటగిరీలో పోస్టును భర్తీ చేయడం ఎలా సాధ్యం అని తెలిపారు. గ్రామంలో ఎస్టీ అభ్యర్థులు లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అంగన్‌వాడీ పోస్టు రిజర్వేషన్‌ను జనరల్‌ కేటగిరీగా మార్చి, అర్హులైన స్థానిక అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను కోరినట్లు సర్పంచ్‌ దుబాసి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular