స్పాట్ వాయిస్, పరకాల :పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమోట్ కంట్రోల్ ద్వారా రావణాసుర దహన కార్యక్రమంతో పాటు బాణాసంచా ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు. ప్రజలు ఐకమత్యంతో పండుగను జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను తిలకించేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రావణ దహనం, బాణాసంచా ప్రదర్శనతో అంగడి మైదానం సందడిగా మారింది.


