ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన కానిస్టేబుల్

మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన కానిస్టేబుల్

📰 Generate e-Paper Clip

కర్రతో కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్

హైదరాబాద్ లో దారుణం

స్పా ట్ హవాయిస్, క్రైమ్

, హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై రైల్వే పోలీస్ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. మహిళను కొట్టడమే కాకుండా, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మహిళపై కానిస్టేబుల్ దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది.

అయితే మహిళపై కానిస్టేబుల్ ఎందుకు దాడి చేశాడు? అసలు అక్కడ ఏం జరిగింది? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల వివరణ రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular