ePaper
Monday, September 7, 2026
ePaper
Homeజాతియంకొండా సురేఖపై వేటుకు హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌..?

కొండా సురేఖపై వేటుకు హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌..?

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై కాంగ్రెస్‌ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు అధిష్ఠానంతో జరిపిన వరుస భేటీల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. సురేఖతో పాటు సీనియర్‌ నేత జి.చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక సమాచారం అందిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

కొండా వ్యాఖ్యలే వేటుకు బలమా?

మంత్రి కొండా సురేఖపై చర్యకు ఆమె ఢిల్లీ లో చేసిన తాజా వ్యాఖ్యలే ప్రధాన కారణంగా మారాయన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో సాగుతోంది. అధిష్ఠానంతో భేటీ అనంతరం కూడా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె వ్యవహారంపై పీసీసీ, క్రమశిక్షణ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్యకు బలమైన కారణంగా మారినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular