స్పాట్ వాయిస్, బ్యూరో : కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి గవర్నర్కు లేఖ పంపారు. తక్షణమే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని లేఖలో కోరారు. రాజీనామాకు సురేఖ నిరాకరించడంతో సీఎం బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో దిల్లీ కేంద్రంగా రెండు రోజులుగా కొనసాగిన పరిణామాలకు అధిష్ఠానం తెరదించింది. సురేఖతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కూడా వేటు పడింది. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్పర్సన్గా జి. సుధారాణిని నియమించారు.

