కొండా సురేఖపై వేటుకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్..?
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతలు అధిష్ఠానంతో జరిపిన వరుస భేటీల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. సురేఖతో పాటు సీనియర్ నేత జి.చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక సమాచారం అందిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కొండా వ్యాఖ్యలే వేటుకు బలమా? మంత్రి కొండా సురేఖపై చర్యకు...