ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeతెలంగాణహామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం: బీఆర్‌ఎస్‌

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం: బీఆర్‌ఎస్‌

📰 Generate e-Paper Clip

స్పాట్‌ వాయిస్‌, భూపాలపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, మూడు డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ భూపాలపల్లిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగ భృతి, రూ.500కే గ్యాస్‌ వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular