స్పాట్ వాయిస్, గణపురం,:సాగునీరు, కరెంటు అందక చేతికొచ్చిన వరి పంట కళ్లముందే ఎండిపోవడంతో ఓ యువరైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్, ఎండిపోయిన తన మూడెకరాల వరి పొలంలోనే ద్విచక్ర వాహనంతో చక్కర్లు కొడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. సమయానికి విద్యుత్, నీరు రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని వాపోయాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన తమను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

