స్పాట్ వాయిస్, భూపాలపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, మూడు డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లిలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగ భృతి, రూ.500కే గ్యాస్ వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.